![]() |
![]() |

ఇంట్రడక్షనే అక్కర్లేని హీరో సూర్య. రోజురోజుకీ ఆయన క్రేజ్ పెరిగిపోతోంది. రీసెంట్‌గా ఆకాశం నీ హద్దురా సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్నాడు సూర్య. సినిమాల్లోకి రాకముందు ఆయన నెలకు ఎంత పారితోషికం అందుకునేవాడో తెలుసా... జస్ట్ రూ.736.గార్మెంట్ ఎక్స్ పోర్ట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ నెలకు రూ.736 జీతాన్ని తీసుకున్నాడు సూర్య.
అక్కడ పనిచేసేటప్పుడు తన తండ్రి ఫేమస్ హీరో శివకుమార్ అని ఎవరితోనూ చెప్పేవాడు కాదట సూర్య. తన తండ్రి బాటలో నడవకూడదని నిర్ణయించుకుని, బిజినెస్‌లోకి దిగాడట సూర్య. ప్రతిరోజూ దాదాపు 18 గంటలు గార్మెంట్ ఫ్యాక్టరీలో కష్టపడితే రూ.736 ఇచ్చేవారట.కష్టపడనిదే ఏదీ రాదన్న విషయం అప్పుడే అర్థమైందని అంటాడు సూర్య.
మణిరత్నం సినిమా నేరుక్కునేర్‌లో నటించిన తర్వాత నటుడిగా గుర్తింపు వచ్చిందని రెండు దశాబ్దాల్లో 40 ప్లస్ సినిమాలు చేయడం, వాటిల్లో ఎన్నో సూపర్‌డూపర్ హిట్ కావడం ఆనందంగా ఉంటుందని అంటాడీ హీరో. నిర్మాతగానూ సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు సూర్య. ప్రస్తుతం దరువు శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇందులో దిశ పఠాని హీరోయిన్.
![]() |
![]() |