![]() |
![]() |

సీనియర్ ప్రొడ్యూసర్ డి. సురేశ్‌బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్ 'అహింస' అనే మూవీతో హీరోగా పరిచయమవుతున్నాడు. డైరెక్టర్ తేజ ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా ప్రొమోషన్స్‌ని వినూత్నంగా చేస్తున్నారు.
మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్ట్‌గా ఫస్ట్ సింగిల్ 'నీతోనే నీతోనే..'ని విడుదల చేశారు. ఆర్పీ పట్నాయక్ ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడిగా కంపోజ్ చేశారు. సిద్ శ్రీరామ్ తన స్వీట్ వాయిస్ తో మెస్మరైజ్ చేయగా, సత్య యామిని వాయిస్ పాటకు మరింత మాధుర్యాన్ని ఇచ్చింది.
"కలలో అయినా
కలయికలో అయినా
కలిసుండని కాలాలైనా
నీతోనే నీతోనే.. నేనెపుడు
నాతోనే నాతోనే నువ్వేపుడు" అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ రాశారు.
అభిరామ్ సరసన నాయికగా కొత్తమ్మాయి గీతిక నటిస్తోంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా కాలం తర్వాత.. తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, ఆర్పీ పట్నాయక్‌ల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ 'అహింస' కోసం కలిసింది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేస్తున్నారు. అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందించగా, సుప్రియ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. సదా, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజత్ బేడీ, రవి కాలే, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ ఇతర పాత్రధారులు.
![]() |
![]() |