![]() |
![]() |

ఇటీవల విజయ్ దేవరకొండను యారోగెంట్ అని, ఎలా బిహేవ్ చేయాలో తెలీదనీ విమర్శించిన ముంబైలోని ప్రఖ్యాత మరాఠా మందిర్ థియేటర్ అధినేత, డిస్ట్రిబ్యూటర్ మనోజ్ దేశాయ్, తన మాటలను వెనక్కి తీసుకున్నారు. అంతే కాదు, స్వయంగా విజయ్‌కి సారీ చెప్పారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. తన సినిమా 'లైగర్' విడుదల సందర్భంలో బాయ్‌కాట్ గ్యాంగ్‌ను ఉద్దేశించి విజయ్ చేసిన కామెంట్లను తప్పుగా అర్థం చేసుకున్నానని కూడా మనోజ్ దేశాయ్ అన్నారు.
ఆదివారం విజయ్ దేవరకొండ ముంబైలోని మనోజ్ దేశాయ్‌ను ఆయన ఆఫీసులో కలుసుకున్నాడు. ఆయన కాళ్లకు నమస్కరించిన ఆశీర్వాదాలు తీసుకున్నాడు. తను ప్రేక్షకుల్ని అమితంగా గౌరవిస్తాననీ, అభిమానిస్తాననీ, వారి ఆశీర్వాదాల కోసం దేశమంతా తిరుగుతూ వచ్చాననీ విజయ్ ఆయనకు తెలిపాడు. తాను ప్రేక్షకుల కోసమే సినిమాలు చేస్తున్నాననీ, వారి మధ్య నుంచే తాను వచ్చాననీ చెప్పాడు. ఆ తర్వాత దేశాయ్ మాట్లాడుతూ, "నేను ఇంతదాకా ఇద్దరు నటులకు మాత్రమే సారీ చెప్పాను. ఇదివరకు అమితాబ్ బచ్చన్‌కు, ఇప్పుడు విజయ్ దేవరకొండకు" అని చెప్పారు. "నేను విజయ్‌ను కలుసుకున్నప్పుడు అతను తన సినిమాల మొత్తం టీమ్ గురించి ఆలోచిస్తాడనే విషయం తెలుసుకున్నాను" అని ఆయన్నారు.
విజయ్‌ను ప్రశంసించిన ఆయన, "నిజంగా విజయ్ నైస్ గై, ఎంతో వినయశీలి. అతడిని నేనెప్పుడూ ఇష్టపడుతుంటాను. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. ఇకనుంచీ అతని అన్ని సినిమాల్నీ నేను తీసుకుంటానని ప్రామిస్ చేస్తున్నా. అతడికి ఆల్ ది బెస్ట్" అని అన్నారు. కాగా, ఆదివారం మనోజ్ దేశాయ్ ఆశీస్సులు తీసుకున్న విజయ్, అక్కడ్నుంచి 'లైగర్' ప్రీమియర్ నిమిత్తం దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడ ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌ను ఆద్యంతం వీక్షించాడు.
![]() |
![]() |