![]() |
![]() |

'మనమంతా'(2016), 'జనతా గ్యారేజ్'(2016) సినిమాలలో నటించి మెప్పించిన మలయాళ స్టార్ మోహన్ లాల్ ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించలేదు. అయితే ఆరేళ్ళ తర్వాత ఇప్పుడు ఆయన తెలుగు సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు.
మోహన్ లాల్ 'వృషభ' అనే ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకి నంద కిశోర్ దర్శకుడు. ఈ సినిమా కథ తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఉండనుంది. ఇందులో తండ్రి పాత్రలో మోహన్ లాల్ కనిపించనుండగా.. కొడుకు పాత్రలో టాలీవుడ్ హీరో నటిస్తాడట. మోహన్ లాల్ కొడుకు పాత్రలో నటించే హీరో ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఏవీఎస్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాను హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేయనున్నారు. మరి పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్న ఈ మూవీలో మోహన్ లాల్ కొడుకు పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి.
![]() |
![]() |