![]() |
![]() |

టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ కమెడియన్ గా ఎదిగారు అలీ. బాలనటుడిగా ఉన్న కాలంలోనే ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. తన కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. అలీ మూవీస్ లోనే కాదు, రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. వైసీపీలో చేరారు కానీ ప్రస్తుతం పాలిటిక్స్‌కు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కరోనా టైం నుంచి ఎంతో మంది పెళ్లిళ్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. వాయిదాపడి ఏడాది కాలంగా పెళ్లి పీటలెక్కుతున్నవారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇక ఇదే టైంలో కమెడియన్ అలీ తన కూతురికి ఎంగేజ్‌మెంట్ చాలా ఘనంగా చేశారు.
పెళ్లి ముహూర్తం త్వరలోనే ఉండబోతోందని కూడా ప్రకటించారు. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. అలీకి ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు ఫాతిమా చదువు పూర్తవడంతో ఆమెకే ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేశారు. ఇక అలీ భార్య జుబేదా యూట్యూబ్ చానెల్ ద్వారా ఫ్యామిలీ విషయాలు, ఫెస్టివల్స్, వంటలు వంటి వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూతురు ఎంగేజ్మెంట్ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఈ ఎంగేజ్మెంట్ కి ఇండస్ట్రీ నుంచి స్టార్స్‌తో పాటు బుల్లితెర నటులు కూడా వచ్చి ఆశీర్వదించారు.
ఈ ఫంక్షన్ లో కమెడియన్ బ్రహ్మానందం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయన వధూవరులను తనదైన స్టైల్‌లో ఆశీర్వదిస్తూ నవ్వించారు. అలీతో బ్రహ్మానందంకు మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి వందలాది సినిమాల్లో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. అలీ ఆహ్వానంచగానే, ఫాతిమా నిశ్చితార్ధానికి వచ్చిన ఆయన, ఆ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.
![]() |
![]() |