![]() |
![]() |

టాక్ ఎలా ఉన్నా, రివ్యూస్ ఎలా వచ్చినా రామ్ హీరోగా నటించిన సినిమాలకు ఫస్ట్ వీక్ మంచి వసూళ్లే వస్తుంటాయి. కానీ అతని లేటెస్ట్ ఫిల్మ్ 'ది వారియర్' వసూళ్లు అందుకు భిన్నంగా ఉండటం ఇండస్ట్రీ వర్గాలను, విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విడుదలకు ముందు మంచి హైప్ తెచ్చుకున్న ఈ మూవీ వసూళ్లు అంచనాలకు భిన్నంగా చాలా తక్కువగా వచ్చాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఈ సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. మౌత్ టాక్‌కు మించి వానలు ఈ సినిమా కలెక్షన్లను దెబ్బకొట్టాయి.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వానలు ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. ఆదివారం కూడా తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆదివారం ఇదే పరిస్థితి. ఫలితంగా నాలుగు రోజుల ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు 'ది వారియర్'కు ఏమాత్రం ఆశాజనకంగా లేకుండా పోయాయి. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి, రూ. 17 కోట్లు లోపే షేర్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ రూ. 14.6 కోట్లు! వర్షాల్లోనూ ఈ స్థాయి కలెక్షన్లు రావడం చిన్న విషయం కాదు. కానీ భారీ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమాకు ఈ కలెక్షన్ ఏమాత్రం సరిపోదు.
తమిళ దర్శకుడు ఎన్. లింగుస్వామి డైరెక్ట్ చేసిన 'ది వారియర్'లో ఆది పినిశెట్టి విలన్‌గా నటించగా, రామ్ జోడీగా కృతి శెట్టి నటించింది. నదియా, అక్షర గౌడ కీలక పాత్రధారులు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ మూవీ ఏక కాలంలో విడుదలైంది. తమిళంలోనూ కలెక్షన్లు తీసికట్టుగా ఉన్నాయి.
![]() |
![]() |