![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్'తో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. 'తగ్గేదేలే' అంటూ బన్నీ మ్యానరిజాన్ని, డ్యాన్స్ స్టెప్పులను బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్స్ సైతం ఇమిటేట్ చేస్తున్నారు. ప్రస్తుతం బన్నీ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ ఎంట్రీపై తాజాగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడిన బన్నీ.. హిందీ సినిమాలో నటించడం తనకు అంత కంఫర్ట్ గా అనిపించని తెలిపాడు. అయితే కథ నచ్చి, చేయాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తానని అన్నాడు. అలాగే కథ నచ్చక ఇప్పటికే ఒక బాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు బన్నీ చెప్పాడు. తనకు ఒక హిందీ సినిమా ఆఫర్ వచ్చిందని, కానీ కథ ఆసక్తికరంగా లేకపోవడంతో ఆ ఆఫర్ వదులుకున్నానని తెలిపాడు. సాదాసీదా కథలు కాకుండా మంచి కథలు వస్తే హిందీలో నటిస్తానని, కానీ అక్కడ నటించాలంటే ఎంతో ధైర్యం కావాలంటూ బన్నీ చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |