![]() |
![]() |

'ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో..' అంటూ అందమైన గొంతుతో తియ్యగా పాడే సునీత గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆమె ఏ పాట పాడినా అది సూపర్ డూపర్ హిట్టే. 'గోదావరి' మూవీలో 'అందంగా లేనా' పాట గురించి ఇక చెప్పక్కర్లేదు. సునీత తన స్వరంతో మ్యాజిక్ చేస్తుంది. ఆమె పాడే పాటలు వింటుంటే మరో లోకంలోకి వెళ్లిపోక తప్పదు ఎవ్వరైనా సరే. తన సింగింగ్ కెరీర్ స్టార్ట్ ఐన దగ్గరనుంచి ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారామె. మరి అలాంటి ఎన్నో అవకాశాలని కల్పించిన వారికి ఏదో ఒక సమయంలో కృతజ్ఞత చెప్పక తప్పదు. అది చెప్పాల్సిందే. ఎందుకంటే అది కర్టసీ కూడా. ఇప్పుడు సునీత అదే పని చేశారు.

మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా తమన్ ఆయనకు విషెస్ చెప్తూ ఒక పోస్ట్ పెట్టాడు. అలాగే కోటి, మణిశర్మ, కీరవాణితో కలిసి దిగిన ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన సునీత, "ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం.. నా సింగింగ్ కెరీర్‌లో నాకు ఎన్నో పాటలు అందించిన లెజెండ్స్‌కు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో" అంటూ పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఈమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
సునీత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. ఐనా ఎక్కడ బెదరకుండా ఆచి తూచి అడుగులేస్తూ తన సింగింగ్ కెరీర్ లో నిలదొక్కుకుంది. 'మీరు చాలా మంచి సింగర్', 'లెజెండ్స్ ని ఇలా చూడడం గ్రేట్' అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |