![]() |
![]() |

2019 నవంబర్ 29న విడుదలైన `అర్జున్ సురవరం`తో చివరి సారిగా వెండితెరపై సందడి చేశాడు యువ కథానాయకుడు నిఖిల్. రెండున్నరేళ్ళుగా మరో సినిమాతో పలకరించని ఈ టాలెంటెడ్ హీరో.. వరుసగా మూడు నెలల పాటు మూడు కొత్త చిత్రాలతో పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఆ వివరాల్లోకి వెళితే.. 2014 నాటి బ్లాక్ బస్టర్ మూవీ `కార్తికేయ`కి సీక్వెల్ గా రూపొందిన చిత్రం `కార్తికేయ 2`. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 22న విడుదల కావాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆగస్టు తొలి వారానికి వాయిదా పడిందీ చిత్రం. మరోవైపు.. పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్ లో నిఖిల్ నటించిన `18 పేజేస్` సెప్టెంబర్ 10న రిలీజ్ కానుందని సమాచారం. ఈ రెండు చిత్రాల్లోనూ (కార్తికేయ 2, 18 పేజెస్) అనుపమ పరమేశ్వరన్ కథానాయిక కావడం విశేషం. అలాగే, నిఖిల్ పాన్ - ఇండియా స్పై థ్రిల్లర్ `స్పై` దసరా కానుకగా అక్టోబర్ తొలి వారంలో రిలీజ్ కానుందని టాక్. దీనికి గ్యారీ బీహెచ్ దర్శకుడు.
సో.. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ - ఇలా మూడు వరుస నెలల్లో నిఖిల్ మనల్ని ఎంటర్టైన్ చేయనున్నాడన్నమాట. మరి.. వీటిలో ఏయే చిత్రాలు విజయపథంలో పయనిస్తాయో చూడాలి.
![]() |
![]() |