![]() |

ఇటీవల డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడిన లేడీ సూపర్‌స్టార్ నయనతార, తన నెక్ట్స్ ఫిల్మ్ షూటింగ్‌కు రెడీ అవుతోంది. చివరగా వెండితెరపై విఘ్నేశ్ డైరెక్ట్ చేసిన కాత్తువాకుల రెండు కాదల్ మూవీలోనూ, ఓటీటీపై O2లోనూ కనిపించిన ఆమె, శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నీలేశ్ కృష్ణ డైరెక్షన్‌లో సినిమా చేయబోతోంది. ఇది నయన్‌కు 75వ సినిమా కావడం గమనార్హం.
ఎన్75 అనే తాత్కాలిక టైటిల్‌తో ఈ మూవీని జీ స్టూడియోస్, ఎన్ఏఏడీ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో జై, సత్యరాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. తమిళంలో సూదు కవ్వమ్, కణా లాంటి సినిమాలకు పనిచేసిన దినేశ్ కృష్ణన్ ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
మంగళవారం జీ స్టూడియోస్ తన అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో Announcing #ladySuperstar75.. Zee Studios is excited to collaborate with #Nayanthara for her 75th film!.. The shoot will begin soon! అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం నయనతార బాలీవుడ్‌లో తన తొలి చిత్రం జవాన్ మూవీని చేస్తోంది. షారుక్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి అట్లీ దర్శకుడు.
![]() |