![]() |
![]() |

సీనియర్ నటుడు నరేష్, కన్నడ తార పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకున్నారని కొంత కాలంగా ప్రచారం నడుస్తోంది. దీనిపై ఇటీవలి దాకా ఆ ఇద్దరిలో ఎవరూ కూడా స్పందించలేదు. ఇప్పుడు నరేశ్ ఆ ప్రచారంపై రెస్పాండ్ అయ్యారు. ఆయనే కాదు, ఈ విషయంపై పవిత్ర కూడా మాట్లాడారు. ఈ వదంతులన్నీ తన మూడో భార్య రమ్య రఘుపతి వల్లే వస్తున్నాయని నరేశ్ అంటున్నారు. బెంగళూరులోని ఓ ఛానెల్‌తో కలిసి ఆమె ఇలా చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఒక ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్న రమ్య రఘుపతికి ఇటీవల నరేశ్ విడాకుల నోటీసు పంపారు. ఆమెకు లీగల్ నోటీసు పంపి నెల రోజులు కావస్తోంది. ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా తన పైనా, పవిత్రా లోకేష్ పైనా ఈ రూమర్ సృష్టించిందనేది నరేశ్ వాదన. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఓ వీడియో సందేశంలో పవిత్ర లోకేష్‌ని తన పేరుతో లింక్ చేయడం అన్యాయమనీ, తమ మధ్య అలాంటిదేమీ లేదనీ నరేశ్ చెప్పారు. తన మాజీ భార్య తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని, ఆమె చీటర్ అనీ ఆయన అన్నారు. తాను, పవిత్ర లోకేష్ మంచి స్నేహితులమని కూడా నరేశ్ చెప్పారు. రమ్యతో తన విడాకుల కేసును పవిత్రా లోకేష్‌తో పెళ్లికి ముడిపెట్టవద్దని అందరినీ ఆయన అభ్యర్థించారు.
మరోవైపు పవిత్ర లోకేష్ ఓ కన్నడ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తాను సుచేంద్ర ప్రసాద్ (తన రెండో భర్త)ని పెళ్లి చేసుకోలేదని చెప్పారు. 11 ఏళ్ల పాటు సహజీవనం చేసిన వీరిద్దరూ ఐదేళ్ల క్రితం విడిపోయారు. తన సమస్యలను మీడియాతో చర్చించాల్సిన అవసరం లేదనీ, ఎందుకంటే దాని వల్ల తనకేమీ న్యాయం జరగదనీ ఆమె అన్నారు.
తను సమస్యలో ఉంటే జనం తనపై సానుభూతి చూపించగలరే కానీ, దాని వల్ల తన సమస్య పరిష్కారం కాదని చెప్పారు. తను మాత్రమే దాన్ని పరిష్కరించుకోగలనని పవిత్ర అన్నారు. తనపై రమ్య చేసిన ఆరోపణలకు ఆమె మాత్రమే జవాబు చెప్పాలని ఆమె అన్నారు.
![]() |
![]() |