![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్.. ఇలా నిన్నటి తరం అగ్ర కథానాయకులంతా ఈ ఏడాది ద్వితీయార్ధంలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు.. తక్కువ గ్యాప్ లోనే ఈ నలుగురు కొత్త చిత్రాలతో పలకరించే అవకాశం కనిపిస్తోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో ఒకటైన `గాడ్ ఫాదర్` విజయదశమి స్పెషల్ గా సెప్టెంబర్ చివరి వారంలో విడుదల కానుందని సమాచారం. ఇక అదే నెల 9వ తేదిన `బ్రహ్మాస్త్రః పార్ట్ వన్ శివ`తో ఎంటర్టైన్ చేయనున్నారు నాగ్. ప్రధానంగా హిందీలో రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ అనువాద రూపంలో అలరించనుంది. అలాగే, సెకండాఫ్ లో `ద ఘోస్ట్` అనే మరో మూవీతో పలకరించనున్నారు కింగ్. ఇక బాలయ్య విషయానికి వస్తే.. దసరా సీజన్ లో లేదా డిసెంబర్ లో గోపీచంద్ మలినేని డైరెక్టోరియల్ తో సందడి చేసే ఛాన్స్ ఉందంటున్నారు. మరోవైపు వెంకీ కూడా సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తున్న `కభీ ఈద్ కభీ దివాళి`తో క్రిస్మస్ సీజన్ లో అలరించనున్నారు. తెలుగులోనూ ఈ బాలీవుడ్ మూవీ అనువాదం కానుందని టాక్. మరి.. సీనియర్ స్టార్స్ చిరు, బాలయ్య, నాగ్, వెంకీ.. 2022 సెకండాఫ్ లో ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చూడాలి.
![]() |
![]() |