![]() |
![]() |

'అసలు ఎప్పుడూ టాటూ వేయించుకోవద్దు' అంటూ సమంత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది. ఇది సమంత స్వీయానుభవంతో చెప్పిన మాట. ఎందుకంటే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత అప్పట్లో చైతన్యకు సంబంధించి మూడు టాటూలు వేయించుకుంది. ఇప్పుడు చైతన్యతో విడిపోయింది.. కానీ ఆ టాటూలు మాత్రం అలాగే ఉండిపోయాయి.
సమంత ఒంటిపై చైతన్యకు సంబంధించి మూడు టాటూలు ఉంటాయి. ఒకటి చైతన్య పేరుతో 'చై', రెండోది ఇద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా 'ఏ మాయ చేసావే'కి గుర్తుగా 'YMC', మూడోది యారో సింబల్. ముఖ్యంగా అప్పట్లో సమంత తన నడుముపై వేసుకున్న 'చై' టాటూని రివీల్ చేస్తూ ఫోటో రిలీజ్ చేసినప్పుడు బాగా వైరల్ అయింది. అయితే చైతన్యతో విడిపోయాక మిగతా రెండు టాటూల సంగతి ఎలా ఉన్నా.. 'చై' టాటూని మాత్రం సర్జరీతోనైనా తొలగించుకునే ఉంటుందని భావించారంతా. కానీ సమంత నడుముపై ఇప్పటికీ 'చై' టాటూ అలాగే ఉంది.
తాజాగా ఓ ఫోటోషూట్ లో పాల్గొన్న సమంత ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలో ఆమె నడుముపై 'చై' టాటూ కనిపిస్తోంది. దానితో పాటు మిగతా రెండు టాటూలు కూడా ఇంకా అలాగే ఉన్నాయి. టాటూ వేయించుకోవడం ఎంత కష్టమో.. దానిని తీయించుకోవడం అంతకంటే ఎక్కువ కష్టం. అందుకేనేమో టాటూలని అలాగే ఉంచుకున్న సమంత.. తన లాగా టాటూలు వేయించుకోవద్దు అంటూ సలహాలు ఇస్తోంది.
![]() |
![]() |