![]() |
![]() |

టాలీవుడ్ తారలు బాలీవుడ్ లో సందడి చేయడం చాన్నాళ్ళుగా ఉన్నదే. అయితే, 2022 ద్వితీయార్ధం ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ క్యాలెండర్ ఇయర్ సెకండాఫ్ లో ముగ్గురు టాలీవుడ్ స్టార్స్ అక్కడి చిత్రాల్లో స్పెషల్ రోల్స్ లో ఎంటర్టైన్ చేయనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఆగస్టు - నాగచైతన్యః
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం `లాల్ సింగ్ చద్ధా`. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా.. 1994 నాటి అమెరికన్ ఫిల్మ్ `ఫారెస్ట్ గంప్`కి హిందీ వెర్షన్. కాగా, ఇందులో తెలుగు యువ కథానాయకుడు నాగచైతన్య ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 11న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది.
సెప్టెంబర్ - నాగార్జునః
ఇక `లాల్ సింగ్ చద్ధా` విడుదలైన నాలుగు వారాల తరువాత వస్తున్న `బ్రహ్మాస్త్రః పార్ట్ వన్ శివ`లో చైతూ నాన్న, కింగ్ నాగార్జున ఓ స్పెషల్ రోల్ లో ఎంటర్టైన్ చేయనున్నారు. అమితాబ్ బచ్చన్, రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ కాంబినేషన్ లో అయన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది.
డిసెంబర్ - వెంకటేశ్ః
అలాగే డిసెంబర్ 30న విక్టరీ వెంకటేశ్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న హిందీ చిత్రం `కభీ ఈద్ కభీ దివాళి` వినోదాలు పంచనుంది. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా యాక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఫర్హద్ సామ్జీ డైరెక్ట్ చేస్తుండగా.. మరో ప్రధాన పాత్రలో జగపతి బాబు కనిపించబోతున్నట్లు సమాచారం.
మరి.. 2022 సెకండాఫ్ లో హిందీనాట స్పెషల్ రోల్స్ లో ఎంటర్టైన్ చేయనున్న చైతూ, నాగ్, వెంకీ, జగ్గూ భాయ్.. ఆయా చిత్రాలతో ఎలాంటి గుర్తింపుని పొందుతారో చూడాలి.
![]() |
![]() |