![]() |
![]() |

ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌తో వీక్షకుల్ని అమితంగా అలరించిన తెలుగువన్ చానల్ నుంచి మరో ఆసక్తికర సిరీస్ త్వరలోనే రాబోతోంది. ఒకవైపు ఆహ్లాదాన్ని పంచుతూ, మరోవైపు ఆసక్తిని రేకెత్తించే ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఆ సిరీస్.. 'గోకులంలో కృష్ణుడు'. తెలుగువన్ బ్యానర్‌పై కంఠంనేని రవిశంకర్ నిర్మించిన ఈ సిరీస్‌లో టైటిల్ రోల్ పోషించిన భరద్వాజ్ బంకుపల్లి తానే ఈ సిరీస్‌కూ దర్శకత్వం వహించారు.
సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 'గోకులంలో కృష్ణుడు' టీజర్‌ను నిర్మాత కంఠంనేని రవిశంకర్ ఆవిష్కరించారు. టీజర్ బాగుందనీ, సిరీస్‌పై అంచనాలు పెంచుతోందనీ ఆయన చెప్పారు. ఒక సినిమాని ఎలాంటి క్వాలిటీతో తీస్తారో, అలాంటి క్వాలిటీతో, ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ సిరీస్‌ను నిర్మించామన్నారు. ఆరు ఎపిసోడ్లుగా నిర్మించిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఈ నెల్లోనే ప్రారంభమవుతుందని వెల్లడించారు. 'ఫన్ బకెట్', 'పాష్ పోరిస్', 'ఫ్యామిలీ ఫ్రై' సిరీస్‌లు తెలుగువన్‌కు ఎంతో పేరు తెచ్చాయనీ, వాటి సరసన 'గోకులంలో కృష్ణుడు' నిలుస్తుందనే నమ్మకం ఉందన్నారు.
హీరో, డైరెక్టర్ భరద్వాజ్ మాట్లాడుతూ, "ఇది అనాథ అయిన కృష్ణ అనే ఓ యువకుడి కథ. తను పెళ్లిచేసుకోబోయే అమ్మాయితో ఓ అందమైన కుటుంబం తనకు వస్తుందనీ ఆశిస్తుంటాడు. దీక్ష అనే ఓ అమ్మాయిని ఇష్టపడతాడు. కానీ అతను ఊహించని విధంగా ఆమె మరో యువకుడ్ని ఇష్టపడుతుంది. ఆ విషయం తెలిశాక కృష్ణ ఏం చేశాడు, దీక్షను అతను దక్కించుకున్నాడా, లేదా? అనేది ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడుస్తుంది. ఓ మంచి సిరీస్ చూశామనే ఫీలింగ్‌ను వీక్షకులకు కలిగిస్తుంది." అని చెప్పారు.
.webp)
తారాగణం:
బంకుపల్లి నాగభరద్వాజ్ (కృష్ణ), అపర్ణరెడ్డి (దీక్ష), ఈశ్వర్ గణేశన్ (సెకండ్ హీరో), నిమీష నూటి, నిహారిక, సుప్రియా భాస్కర్, బంటి వి.డి.ఎన్., డార్లింగ్ దాస్, ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్, గణ, సునీల్ అళహరి, వీరేంద్ర గిడ్డ, మహాలక్ష్మి, శ్రీలక్ష్మి, శ్రీజారెడ్డి, ఆర్.కె. నాయుడు, సురేంద్ర రాజ్, మాస్టర్ హేమంత్.
సాంకేతిక బృందం:
సినిమాటోగ్రఫీ: కృష్ణచైతన్య సాళ్వ
సెకండ్ యూనిట్ సినిమాటోగ్రఫీ: చౌదరి మహేశ్, మనోజ్ చింతలపూడి
మ్యూజిక్: అజయ్ పట్నాయక్
ఎడిటింగ్: సాయి యశ్వంత్
డీఐ: సుబ్రహ్మణ్యం మీసాల
లిరిక్స్: అనంత్ చిర్రావూరి, బంకుపల్లి నాగభరద్వాజ్
సింగర్స్: ఆదిత్య భీమతాటి, నీలిమ
మేకప్: రాధాకృష్ణ, మంజునాథ్
కాస్ట్యూమ్స్: మోహనకృష్ణ, భరత్ ప్రభ
పబ్లిసిటీ డిజైన్స్: అనిల్
డబ్బింగ్: లక్ష్మణరావు లుక్క
మిక్సింగ్: త్రిమూర్తులు
అకౌంట్స్: ఎం. ప్రభాకర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రసన్న మూర్తి ఘంటికోట
నిర్మాత: రవిశంకర్ కంఠంనేని
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బంకుపల్లి నాగభరద్వాజ్.
.webp)
![]() |
![]() |