![]() |
![]() |

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'విరాట పర్వం'. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని జూన్ 17న విడుదల చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
'నీది నాది ఒకే కథ' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో పాటు.. విభిన్న చిత్రాలు చేసే రానా, సాయి పల్లవి నటిస్తున్న సినిమా కావడంతో 'విరాట పర్వం'పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అందుకు తగ్గట్లే ఈ మూవీ గ్లింప్స్, టీజర్ ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. ట్రైలర్ తో ఆ అంచనాలను మరింత పెంచడానికి సిద్ధమవుతోంది మూవీ టీమ్. ఈ సినిమా ట్రైలర్ ని జూన్ 5న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.

ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |