![]() |
![]() |

టాప్ రేంజ్ హీరోయిన్ కావడంలో విఫలమైనప్పటికీ తెలుగు సహా మిగతా భాషల్లోనూ తగినన్ని సినిమాలు చేతిలో ఉన్న అందాల తార రాశీ ఖన్నా. త్వరలో బాలీవడు్‌లో 'యోధ' అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోందామె. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్‌ను ఆమె మొదలు పెట్టేసింది. మదర్స్ డే సందర్భంగా తన తల్లి కలల్లో ఒకదానిని నెరవేర్చడం ద్వారా ఆమెకు అమితాశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగించింది. ప్రీమియమ్ BMW 740Li కారును అమ్మకు కానుకగా ఇచ్చింది. BMW 7 సిరీస్‌లో అనేక సౌకర్యాలున్న అడ్వాన్స్‌డ్ కార్లలో అదొకటి. దాని ఖరీదు రోడ్డు మీదకు వచ్చేటప్పటికి రూ. 1.71 కోట్ల వరకు ఉంటుంది.
రాశీ ఖన్నా ఒక క్లాసిక్ బ్లూ మెటాలిక్ BMW 740Li కారును కొనుగోలు చేసింది. డార్క్ బ్రౌన్ ఇంటీరియర్స్‌తో ఆటోమొబైల్ లుక్‌తో ఆ కారు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. తల్లితండ్రులతో కలిసి ఆ కారు పక్కన నిల్చొని కెమెరాకు పోజులిచ్చింది రాశీ.
త్వరలో ఆమె గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' సినిమాలో లాయర్ ఝాన్సీ క్యారెక్టర్‌తో ఆకట్టుకోవడానికి రెడీ అవుతోంది. అలాగే నాగచైతన్యతో కలిసి 'థాంక్ యూ' సినిమాని చేస్తోంది రాశీ. అలాగే షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో ఫర్జి అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీకి కూడా ఆమె పరిచయం కానున్నది.

![]() |
![]() |