![]() |
![]() |

2020 జనవరిలో 'సరిలేరు నీకెవ్వరు'తో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. రెండేళ్ల తర్వాత 'సర్కారు వారి పాట'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'గీత గోవిందం' వంటి సంచలన విజయం తర్వాత పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 12న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఆ అంచనాలకు తగ్గట్లే మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది.
'సర్కారు వారి పాట' వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.120 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి భారీస్థాయిలో 96.50 కోట్ల బిజినెస్ జరిగింది. నైజాంలో 36 కోట్లు, సీడెడ్ లో 13 కోట్లు, ఆంధ్రాలో 47.5 కోట్లు(ఉత్తరాంధ్ర 12.50 కోట్లు, ఈస్ట్ 8.50 కోట్లు, వెస్ట్ 7 కోట్లు, గుంటూరు 9 కోట్లు, కృష్ణ 7.50 కోట్లు, నెల్లూరు 4 కోట్లు) బిజినెస్ చేసింది. కర్ణాటకలో 8.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 3 కోట్లు, ఓవర్సీస్ 11 కోట్లు బిజినెస్ చేయగా.. ఓవరాల్ రైట్స్ 120 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.
మహేష్ గత చిత్రం వరల్డ్ వైడ్ గా 99.30 కోట్ల బిజినెస్ చేయగా ఫుల్ రన్ లో 138.78 కోట్ల షేర్ రాబట్టి బయ్యర్లకు దాదాపు 39 కోట్ల లాభాలు మిగిల్చింది. అందుకే 'సర్కారు వారి పాట' బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. మహేష్ కెరీర్ లో ఇప్పటిదాకా అత్యధిక బిజినెస్ చేసిన సినిమా 'స్పైడర్'. వరల్డ్ వైడ్ గా రూ.124.3 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. బిజినెస్ పరంగా 'సర్కారు వారి పాట' మహేష్ కెరీర్ లో రెండో స్థానంలో నిలిచింది. మరి ఈ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'కి మించిన కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటుతుందేమో చూడాలి.
![]() |
![]() |