![]() |
![]() |
.webp)
నేడు(మే 9) రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, నెటిజన్లు నుంచి విజయ్ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. నేటితో 33 ఏళ్ళు పూర్తి చేసుకున్న విజయ్.. తన తాజాగా పుట్టినరోజుని స్టార్ హీరోయిన్ సమంతతో సెలెబ్రేట్ చేసుకున్నాడు.

విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతోంది. ఈ మూవీ సెట్ లోనే విజయ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా విజయ్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన సమంత.. విజయ్ కి విషెస్ చెప్పింది. "నీకు అందుతున్న ప్రేమ, ప్రశంసలకు నువ్వు పూర్తి అర్హుడివి. నువ్వు పని చేసే విధానం స్ఫూర్తిదాయకం" అంటూ సమంత ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
![]() |
![]() |