![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `సర్కారు వారి పాట`. `గీత గోవిందం` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేశ్ బాబుకి జోడీగా కేరళకుట్టి కీర్తి సురేశ్ దర్శనమివ్వనుంది. యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు సమకూర్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వేసవి కానుకగా ఈ నెల 12న థియేటర్స్ లో ఎంటర్టైన్ చేయనుంది.
ఇదిలా ఉంటే, `సర్కారు వారి పాట` రన్ టైమ్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. 163 నిమిషాలు (2 గంటల 43 నిమిషాలు) నిడివితో ఈ సినిమా వినోదాలు పంచనుందట. అదే గనుక నిజమైతే.. మహేశ్ కి హ్యాట్రిక్ హిట్స్ అందించిన అతని గత మూడు చిత్రాలు `భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు` నిడివితో పోలిస్తే ఇది తక్కువనే చెప్పాలి. 173 నిమిషాల రన్ టైమ్ తో `భరత్ అనే నేను` సాగితే.. 178 నిమిషాల డ్యూరేషన్ తో `మహర్షి` వినోదాలు పంచింది. ఇక `సరిలేరు నీకెవ్వరు` 169 నిమిషాల రన్ టైమ్ తో సాగింది. మరి.. `భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు` తరహాలోనే భారీ నిడివితో వస్తున్న `సర్కారు వారి పాట` కూడా బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తుందేమో చూడాలి.
![]() |
![]() |