![]() |
![]() |

అనిరుధ్ రవిచందర్.. ప్రస్తుతం తమిళనాట హవా సాగిస్తున్న యువ సంగీత దర్శకుడు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, ధనుష్.. ఇలా పలువురు స్టార్స్ తో జట్టుకడుతూ వార్తల్లో నిలుస్తున్నాడీ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్.
ఇదిలా ఉంటే, గత ఏడాది `మాస్టర్`, `డాక్టర్` చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్న అనిరుధ్ కి 2022 అంతగా కలిసిరావడం లేదు. మరీ ముఖ్యంగా.. ఈ ఏప్రిల్ లో వరుసగా మూడు వారాల పాటు అనిరుధ్ సంగీతంలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట నిరుత్సాహపరిచాయి. వాటిలో రెండు తమిళ సినిమాలు కాగా.. ఒకటి హిందీ మూవీ. ఆ వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 13న వచ్చిన విజయ్ - పూజా హెగ్డే స్టారర్ `బీస్ట్` డిజప్పాయింట్ చేయగా.. ఏప్రిల్ 22న రిలీజైన షాహిద్ కపూర్ - మృణాళ్ ఠాకూర్ స్టారర్ `జెర్సీ` (ఈ హిందీ చిత్రానికి అనిరుధ్ నేపథ్య సంగీతమందించాడు) కూడా అదే బాట పట్టింది. ఇక ఏప్రిల్ 28న జనం ముందుకొచ్చిన విజయ్ సేతుపతి, నయనతార, సమంత స్టారర్ `కాత్తు వాక్కుల రెండు కాదల్` (తెలుగులో `కణ్మణి రాంబో ఖతీజా`) కూడా నిరాశపరిచింది. మొత్తమ్మీద.. 2022 ఏప్రిల్ లో అనిరుధ్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూటగట్టుకున్నాడనే చెప్పాలి. మరి.. రాబోయే `డాన్`, `విక్రమ్` చిత్రాలతోనైనా అనిరుధ్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
![]() |
![]() |