![]() |
![]() |

రెండో వీకెండ్ ముగిసిన తర్వాత కూడా 'కేజీఎఫ్ చాప్టర్-2' జోరు కొనసాగుతూనే ఉంది. రెండో సోమవారమైన 12వ రోజు వరల్డ్ వైడ్ గా 12.73 కోట్ల షేర్, 24.80 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. దీంతో ఈ సినిమా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 457.73 కోట్లు షేర్, 925.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మరో నాలుగైదు రోజుల్లో 1000 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఉంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజు 1.19 కోట్ల షేర్(2.10 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసిన కేజీఎఫ్-2 పన్నెండు రోజుల్లో 74.51 కోట్ల షేర్(117.60 కోట్ల గ్రాస్) రాబట్టింది. తెలుగు స్టేట్స్ లో 78 కోట్ల బిజినెస్ చేసిన మూవీ ఈ వీకెండ్ లోపు బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది. ఇప్పటిదాకా ఈ సినిమా తెలంగాణలో 38.62 కోట్లు, ఆంధ్రాలో 25.47 కోట్లు, రాయలసీమలో 10.42 కోట్ల షేర్ వసూలు చేసింది.
వరల్డ్ వైడ్ గా 345 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ 12 రోజుల్లో 457.73 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఓవరాల్ గా ఇప్పటిదాకా బయ్యర్లకు 110 కోట్లకు పైగా ప్రాఫిట్స్ మిగిల్చింది. 12 రోజుల్లో కర్ణాటకలో 82.10 కోట్లు(100 కోట్లు బిజినెస్), తెలుగు రాష్ట్రాల్లో 74.51 కోట్లు(78 కోట్లు బిజినెస్), తమిళనాడు 34.80 కోట్లు(27 కోట్లు బిజినెస్), కేరళ 23.72 కోట్లు(10 కోట్లు బిజినెస్), హిందీ+రెస్టాఫ్ ఇండియా 166.05 కోట్లు(100 కోట్లు బిజినెస్), ఓవర్సీస్ 76.55 కోట్ల(30 కోట్లు బిజినెస్) షేర్ రాబట్టింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, నార్త్, ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన కేజీఎఫ్-2 త్వరలోనే అన్ని ఏరియాల్లో ప్రాఫిట్స్ లోకి అడుగుపెట్టే అవకాశముంది.
ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమాల్లో కేజీఎఫ్-2 నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో 1958 కోట్లతో 'దంగల్', 1810 కోట్లతో 'బాహుబలి-2', 1112.50 కోట్లతో 'ఆర్ఆర్ఆర్' ఉన్నాయి. కేజీఎఫ్-2 ఫుల్ రన్ లో ఆర్ఆర్ఆర్ ని బీట్ చేసి మూడో స్థానానికి వస్తుందేమో చూడాలి. 'ఆర్ఆర్ఆర్' 12 రోజుల్లో రూ.938.50 కోట్ల గ్రాస్ రాబట్టగా.. కేజీఎఫ్-2 రూ.925.35 కోట్లు వసూలు చేసింది. 'ఆర్ఆర్ఆర్' 17 వ రోజు 1000 కోట్ల క్లబ్ లో చేరింది. కేజీఎఫ్-2 కూడా 17 లేదా 18 వ రోజు ఆ ఫీట్ సాధించే ఛాన్స్ ఉంది.
![]() |
![]() |