![]() |
![]() |

'బాహుబలి-2' తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలు ఫ్యాన్స్ ని నిరాశపరిచాయి. దీంతో ప్రభాస్ నటిస్తున్న తదుపరి సినిమాలపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'సలార్'పై వారి దృష్టంతా ఉంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్-2' ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలిసిందే. కేజీఎఫ్-2 తర్వాత ప్రశాంత్ డైరెక్ట్ చేస్తున్న మూవీ సలార్ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకుతగ్గట్లే ఈ సినిమాని భారీస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ సినిమాలంటే భారీ యాక్షన్ సీక్వెన్స్ లు, ఎలివేషన్స్ ఉంటాయి. ఇక సలార్ లో ప్రభాస్ కటౌట్ కి తగ్గట్లు కేజీఎఫ్ కి మించిన యాక్షన్ ఎపిసోడ్స్ చూపించబోతున్నాడట ప్రశాంత్. కోల్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ తో పాటు ఇంటర్వెల్ సీక్వెన్స్, ప్రీ క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. ఓ లోయలో జరిగే ఇంటర్వెల్ సీక్వెన్స్ గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది అంటున్నారు. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందట. దీనికోసం 20 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.
కేజీఎఫ్ లో రాకీ భాయ్ ని మించి అంతకు డబుల్ వయొలెంట్ గా సలార్ లో ప్రభాస్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కొంతభాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. నెక్స్ట్ షెడ్యూల్ మేలో జరగనుండగా.. ఆ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారని సమాచారం.
![]() |
![]() |