![]() |
![]() |
.webp)
నటసింహం నందమూరి బాలకృష్ణ కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతుండటంతో తాజాగా ఆయనకు వైద్యులు సర్జరీ నిర్వహించారని, దీంతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిందని వార్తలొస్తున్నాయి. ఈ మేరకు మోకాలికి కట్టు కట్టుకొని డాక్టర్స్ తో కలిసి బాలయ్య దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో బాలయ్య అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే నిజానికి బాలయ్యకు ఎటువంటి సర్జరీ జరగలేదు, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.
బాలయ్యకు సర్జరీ జరిగింది అంటూ వస్తున్న వార్తలపై ఆయన పీఆర్ టీమ్ తాజాగా స్పందించింది. "బాలకృష్ణ గారికి ఎటువంటి సర్జరీ జరగలేదు, ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కొరకు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. ఈ రోజు ఆయన సారధి స్టూడియోస్ లో #NBK107 షూటింగ్ లో పాల్గొన్నారు. దయ చేసి అవాస్తవాలను ప్రచురించవద్దు, వ్యాప్తి చేయవద్దు." అంటూ ఓ ప్రకటనలో పేర్కొంది.

'అఖండ'తో బ్లాక్ బస్టర్ అందుకొని జోష్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బాలయ్య 107 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
![]() |
![]() |