![]() |
![]() |

వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి తరపున, ఆంధ్రప్రభుత్వం తరపున బలమైన వాణిని వినిపిస్తూ వచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రివర్గ విస్తరణలో తన పదవిని కోల్పోయారు. సందర్భం వచ్చినప్పుడల్లా జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌ను తూర్పారబడుతూ వస్తుంటారాయన. సందర్భవశాత్తూ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవాళ్లు. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన నాని, కేబినెట్ పదవిని కోల్పోవడం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా మరోసారి పవన్ కల్యాణ్‌పై విమర్శల వర్షం కురిపించారు.
చిరంజీవిని దేవుడి లాంటి మనిషిగా పొగిడిన నాని, ఆయనతో పవన్ కల్యాణ్‌ను ఏ రకంగానూ పోల్చలేమని చెప్పారు. పవన్ కల్యాణ్‌కు ఒకటే ఎజెండా అనీ, అది జగన్‌ను గద్దెదింపి, చంద్రబాబును అధికారంలోకి తేవడమేనని ఆయనన్నారు. పవన్ కల్యాణ్ మాటల్లో నిలకడ ఉండదని మనకు తెలుసంటూ ఏద్దేవా చేశారు.
ప్రజలు తనను ఆదరించడం లేదని చాలా త్వరగా గ్రహించిన చిరంజీవి రాజకీయాల నుంచి హుందాగా తప్పుకున్నారనీ, కానీ పవన్ కల్యాణ్ అందుకు భిన్నమనీ పేర్ని నాని అభిప్రాయపడ్డారు.
![]() |
![]() |