![]() |
![]() |
.webp)
'కేజీఎఫ్ చాప్టర్-2' రెండో వీకెండ్ లోనూ కలెక్షన్ల తుఫాన్ సృష్టించింది. పదోరోజు(శనివారం) 55.85 కోట్ల గ్రాస్, 11వ రోజు(ఆదివారం) 69.30 కోట్ల గ్రాస్ రాబట్టిన కేజీఎఫ్-2 తాజాగా 900 కోట్ల క్లబ్ లో చేరింది. రీసెంట్ బ్లాక్ బస్టర్ 'ఆర్ఆర్ఆర్' 11 రోజుల్లో రూ.920 కోట్ల గ్రాస్ రాబట్టగా.. కేజీఎఫ్-2 రూ.900.55 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమాల్లో కేజీఎఫ్-2 నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో 1958 కోట్లతో 'దంగల్', 1810 కోట్లతో 'బాహుబలి-2', 1110 కోట్లతో 'ఆర్ఆర్ఆర్' ఉన్నాయి. ఫుల్ రన్ లో ఆర్ఆర్ఆర్ ని బీట్ చేసి మూడో స్థానానికి వస్తుందేమో చూడాలి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజు 3.36 కోట్ల షేర్(5.40 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసిన కేజీఎఫ్-2 పదకొండు రోజుల్లో 73.52 కోట్ల షేర్(117.60 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఇప్పటిదాకా ఈ సినిమా తెలంగాణలో 38.18 కోట్లు, ఆంధ్రాలో 25.06 కోట్లు, రాయలసీమలో 10.28 కోట్ల షేర్ వసూలు చేసింది.
వరల్డ్ వైడ్ గా 345 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ 11 రోజుల్లో 445 కోట్ల షేర్(900.55 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. 11 రోజుల్లో కర్ణాటకలో 79.60 కోట్లు(100 కోట్లు బిజినెస్), తెలుగు రాష్ట్రాల్లో 73.52 కోట్లు(78 కోట్లు బిజినెస్), తమిళనాడు 33.10 కోట్లు(27 కోట్లు బిజినెస్), కేరళ 22.58 కోట్లు(10 కోట్లు బిజినెస్), హిందీ+రెస్టాఫ్ ఇండియా 162.05 కోట్లు(100 కోట్లు బిజినెస్), ఓవర్సీస్ 74.15 కోట్ల(30 కోట్లు బిజినెస్) షేర్ రాబట్టింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, నార్త్, ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన కేజీఎఫ్-2 త్వరలోనే అన్ని ఏరియాల్లో ప్రాఫిట్స్ లోకి అడుగుపెట్టే అవకాశముంది.
![]() |
![]() |