Home  »  News  »  'చరణ్' క్రేజ్ ని క్యాష్ చేసుకోలేకపోతున్న 'ఆచార్య'

Updated : Apr 25, 2022

2013 లో 'జంజీర్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమాతో దారుణ విమర్శలు ఎదుర్కొన్నాడు. అప్పటినుంచి బాలీవుడ్ వైపు చూడని చరణ్ దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించాడు. విడుదలై నెలరోజులైనా ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా చరణ్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే చరణ్ కి క్రేజ్ క్యాష్ చేసుకోవడంలో 'ఆచార్య' వెనకపడిపోయింది.

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆచార్య'. ఇందులో సిద్ధ అనే కీలక పాత్రలో చరణ్ నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఆర్ఆర్ఆర్'తో హిందీలో చరణ్ కి వచ్చిన క్రేజ్ దృష్ట్యా ఆచార్యను హిందీలో రిలీజ్ చేస్తే మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది. కానీ ఆచార్య ఈ ఛాన్స్ ని మిస్ చేసుకుంటుంది. తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి రిలీజ్ చేయట్లేదని చరణ్ తెలిపాడు.

ఆచార్య ప్రమోషన్స్ లో సినిమా హిందీ రిలీజ్ పై చరణ్ స్పందించాడు. ఇతర భాషల్లో సినిమాను విడుదల చేయాలంటే డబ్బింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం కావాలని అన్నాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్, RC15 షూటింగ్ కారణంగా తనకు అంత సమయం లేదని చెప్పాడు. ఆచార్యను వేరే భాషల్లోనూ తన సొంత వాయిస్ తోనే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యానని, ‘ఆచార్య’ హిందీ వెర్షన్ విడుదలకు మరికొంత సమయం పడుతుందని చరణ్ తెలిపాడు.

ఆలస్యంగా రిలీజ్ చేస్తే హిందీ ప్రేక్షకుల నుంచి ఊహించిన స్థాయిలో స్పందన వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కి వచ్చిన క్రేజ్ ని ఉపయోగించుకొని ఇప్పుడే రిలీజ్ చేస్తే టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.