![]() |
![]() |

యశ్‌ను పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా మార్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ విజృంభణ తెలుగునాట కూడా అసాధారణంగా కొనసాగుతోంది. రజనీకాంత్ సినిమాల స్థాయిని మించి ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ. 50 కోట్ల మైలురాయిని దాటేయడం పెద్ద విశేషం. నాలుగో రోజు ఈ సినిమాకు రూ. 10.81 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వెరసి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు రూ. 53.56 కోట్ల షేర్‌కు చేరుకున్నాయి.
నాలుగో రోజు ఆంధ్రలో రూ. 4 కోట్లు, తెలంగాణలో రూ. 5.50 కోట్లు, రాయలసీమలో రూ. 1.31 కోట్లను 'కేజీఎఫ్ చాప్టర్ 2' రాబట్టింది. మొత్తంగా చూస్తే.. నాలుగు రోజులకు ఈ సినిమా ఆంధ్రలో రూ. 17.96 కోట్లు, తెలంగాణలో రూ. 28.17 కోట్లు, రాయలసీమలో రూ. 7.43 కోట్ల షేర్ వసూలు చేసింది.
తెలుగునాట 'కేజీఎఫ్ చాప్టర్ 2' ప్రి బిజినెస్ వాల్యూ రూ. 78 కోట్లని అంచనా. అంటే ఇప్పటికే 68 శాతం పైగా రికవర్ అయ్యింది. వచ్చే వీకెండ్ దాకా ఈ సినిమా ప్రభంజనం బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్, యశ్ క్యారెక్టరైజేషన్, మదర్ సెంటిమెంట్ కలిసి 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను మాన్‌స్టర్ హిట్‌గా మలిచాయి.
![]() |
![]() |