![]() |
![]() |
.webp)
స్టార్ హీరోలతోనే సినిమాలు తీసే దర్శకుల్లో కోలీవుడ్ కెప్టెన్ ఎ.ఆర్. మురుగదాస్ ఒకరు. ఇప్పటికే రజినీకాంత్, చిరంజీవి, విజయ్ కాంత్, ఆమిర్ ఖాన్, మహేశ్ బాబు, అజిత్, విజయ్, సూర్య, అక్షయ్ కుమార్ వంటి అగ్ర కథానాయకులతో జట్టుకట్టిన మురుగదాస్.. త్వరలో మరో టాప్ స్టార్ తో కలిసి పనిచేయనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. వైవిధ్యభరిత చిత్రాలతో, పాత్రలతో దక్షిణాదిన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చియాన్ విక్రమ్ తో మురుగదాస్ ఓ యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో పట్టాలెక్కే అవకాశముందని సమాచారం. అంతేకాదు.. 2023 వేసవిలో ఈ సినిమాని రిలీజ్ చేసే దిశగా ప్లానింగ్ జరుగుతోందని బజ్. త్వరలోనే విక్రమ్ - మురుగదాస్ కాంబో మూవీపై క్లారిటీ రానుంది. మరి.. విక్రమ్, మురుగదాస్ ఫస్ట్ కాంబోలో రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. విక్రమ్ తాజా చిత్రం `కోబ్రా` వేసవి కానుకగా మే 26న జనం ముందుకు రానుంది. అలాగే, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో చేసిన `పొన్నియన్ సెల్వన్` (ఫస్ట్ పార్ట్) సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. అదే విధంగా పా.రంజిత్ దర్శకత్వంలోనూ విక్రమ్ ఓ మూవీ చేస్తున్నారు.
![]() |
![]() |