![]() |
![]() |

టాలీవుడ్ టాప్ కంపోజర్స్ లో ఎస్. తమన్ ఒకరు. ఒకవైపు స్టార్ హీరోలతో జట్టుకడుతూనే.. మరోవైపు యంగ్ హీరోలతోనూ ముందుకు సాగుతున్నాడీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇదిలా ఉంటే, 2022 ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీ నెలలోనూ సందడి చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు తమన్. జనవరిలో `సూపర్ మచ్చి`తో పలకరించిన తమన్.. ఫిబ్రవరిలో `డీజే టిల్లు` (నేపథ్య సంగీతం), `భీమ్లా నాయక్`తో ఎంటర్టైన్ చేశాడు. ఇక మార్చిలో `రాధే శ్యామ్` (నేపథ్య సంగీతం)తో విష్ చేసిన ఈ స్టార్ కంపోజర్.. ఏప్రిల్ నెలలో `గని`తో అలరించే ప్రయత్నం చేశాడు. కాగా, వీటిలో ఫిబ్రవరిలో రిలీజైన `డీజే టిల్లు`, `భీమ్లా నాయక్` మాత్రమే కమర్షియల్ గా మెప్పించగా.. మిగిలిన మూడు సినిమాలు నిరాశపరిచాయి. మరీముఖ్యంగా.. రీసెంట్ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ అయిన `రాధే శ్యామ్`, `గని` డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో.. మే 12న రాబోతున్న `సర్కారు వారి పాట`పైనే ఆశలు పెట్టుకున్నాడు తమన్. మరి.. ట్రాక్ తప్పిన తమన్ కి.. చార్ట్ బస్టర్స్ సమేతంగా వస్తున్న `సర్కారు వారి పాట` అయినా వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
కాగా, `సర్కారు వారి పాట`లో సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తుండగా.. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
![]() |
![]() |