![]() |
![]() |

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్ధేశీ జంటగా నటిస్తున్న సినిమా 'వినరో భాగ్యము విష్ణుకథ'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరుపతిలో జరుగుతుంది. 35 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో 80 శాతం షూటింగ్ పూర్తి కానుంది. ఇందులోనే పాటలు, ఫైట్ సీక్వెన్స్ లు కూడా ఉండబోతున్నాయి. నేడు శ్రీరామనవమి సందర్భంగా 'వినరో భాగ్యము విష్ణుకథ' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. గుడి ముందు డు డు బసవన్నతో లుంగీ కట్టుకొని పర్ఫెక్ట్ మాస్ లుక్ లో అలరిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ లుక్ మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
.webp)
ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ గా పని చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు వ్యవహరిస్తున్నారు. సత్యగమిడి, శరత్ చంద్ర నాయుడు ఈ సినిమాకి ఎక్స్ క్యూటివ్ నిర్మాతలు.
![]() |
![]() |