![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' ప్రభంజనం కొనసాగుతోంది. 16 వ రోజు ఈ సినిమా రూ.550 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేయడంతో పాటు.. రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలోనే వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన మూడో సినిమాగా నిలిచింది. 1958 కోట్ల గ్రాస్ తో దంగల్, 1810 కోట్ల గ్రాస్ తో బాహుబలి-2 మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
16 వ రోజు వరల్డ్ వైడ్ గా 10.40 కోట్ల షేర్(23 కోట్ల గ్రాస్) రాబట్టిన ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాల్లో 3.10 కోట్ల షేర్(5.10 కోట్ల గ్రాస్) సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.191 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ 16 రోజుల్లో 253.61 కోట్ల షేర్(382 కోట్ల గ్రాస్) రాబట్టింది. నైజాంలో 70 కోట్ల బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ 16 రోజుల్లో 105.54 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సీడెడ్ లో 37 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా 48.12 కోట్లు రాబట్టి 50 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. అలాగే ఆంధ్రాలో 84 కోట్లు బిజినెస్ చేయగా ఇప్పటిదాకా 99.95 కోట్లు కలెక్ట్ చేసి నేడు వంద కోట్ల మార్క్ సాధించనుంది.

16 రోజుల్లో ఓవర్సీస్ లో 93.50 కోట్లు(బిజినెస్ 75 కోట్లు), హిందీలో 108.95 కోట్లు(బిజినెస్ 92 కోట్లు), కర్ణాటకలో 40.85 కోట్లు(బిజినెస్ 41 కోట్లు), తమిళనాడులో 36.15 కోట్లు(బిజినెస్ 35 కోట్లు), కేరళలో 10.10 కోట్లు(బిజినెస్ 9 కోట్లు), రెస్టాఫ్ ఇండియా 8.35 కోట్లు(బిజినెస్ 8 కోట్లు) షేర్ రాబట్టింది. కర్ణాటక మినహా అన్ని చోట్లా ఆర్ఆర్ఆర్ బ్రేక్ ఈవెన్ సాధించింది. నేడు కర్ణాటకలో కూడా బ్రేక్ ఈవెన్ అందుకోనుంది.
వరల్డ్ వైడ్ గా 451 కోట్ల బిజినెస్ ఆర్ఆర్ఆర్ ఇప్పటిదాకా 551.51 కోట్ల షేర్(1003 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. ఇప్పటిదాకా ఈ సినిమా బయ్యర్లకు దాదాపు 100 కోట్ల లాభం తెచ్చిపెట్టింది. నేడు శ్రీరామనవమి కావడంతో ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల షేర్ రాబట్టే అవకాశముంది. ఫుల్ రన్ లో ఈ సినిమా 600 కోట్ల షేర్ మార్క్ అందుకునే ఛాన్స్ ఉంది.
![]() |
![]() |