![]() |
![]() |
.webp)
రెండు భాగాలుగా తెరకెక్కిన `బాహుబలి` సిరీస్ .. జాతీయ స్థాయిలో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే.. మొదటి భాగం `బాహుబలి - ద బిగినింగ్`(2015)ని మించి రెండో భాగమైన `బాహుబలి - ద కంక్లూజన్` (2017) మరింతగా వసూళ్ళ వర్షం కురిపించి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
కట్ చేస్తే.. ఇప్పుడు `బాహుబలి` సిరీస్ తరహాలోనే పలు సినిమాలు పాన్ - ఇండియా బాట పట్టడమే కాకుండా, రెండేసి భాగాలుగా తెరకెక్కుతున్నాయి. వాటిలో `కేజీఎఫ్` ఒకటి. ఇప్పటికే తొలి భాగం `కేజీఎఫ్ః ఛాప్టర్ 1` సంచలన విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ `కేజీఎఫ్ః ఛాప్టర్ 2`పై కూడా ఎనలేని క్రేజ్ నెలకొని ఉంది. కాగా, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 14న జనం ముందుకు రానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `బాహుబలి` సిరీస్ లో రెండో చిత్రమైన `బాహుబలి - ద కంక్లూజన్` కూడా గతంలో ఏప్రిల్ నెలలోనే విడుదలై చరిత్ర సృష్టించింది. మరి.. ఆ ఏప్రిల్ సెంటిమెంట్ రిపీటై `కేజీఎఫ్` సెకండ్ పార్ట్ `కేజీఎఫ్ః ఛాప్టర్ 2` కూడా అఖండ విజయం సాధిస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే, ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన `కేజీఎఫ్ః ఛాప్టర్ 2`లో యశ్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు.
![]() |
![]() |