![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అకీరా డెబ్యూ మూవీ సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశముందని కూడా ఇటీవల ప్రచారం జరిగింది. అయితే అకీరా తల్లి, నటి రేణు దేశాయ్ అసలు తన కుమారుడికి సినిమాలు అంటేనే ఆసక్తి లేదని షాకింగ్ కామెంట్స్ చేసింది.
నేడు(ఏప్రిల్ 8న) అకీరా నందన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. అందులో అకీరా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అకీరా మంచి మనసున్న జెంటిల్ మేన్ అని, అతనికి అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఆ బాక్సింగ్ వీడియోని పంచుకుంది రేణు దేశాయ్. ఆ వీడియోని చూసిన మెగా ఫ్యాన్స్ త్వరలోనే అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే రేణు దేశాయ్ మాత్రం అకీరా సినిమాల్లోకి రావట్లేదని చెప్పి షాకిచ్చింది.

అకీరా అసలు యాక్టర్ అవ్వాలి అనుకోవడం లేదని, ఇప్పటిదాకా ఏ సినిమాకి సైన్ చేయలేదని రేణు దేశాయ్ తెలిపింది. అకీరా డెబ్యూ మూవీ గురించి వస్తున్న వార్తలను నమ్మొద్దని స్పష్టం చేసింది.
![]() |
![]() |