![]() |
![]() |

రీసెంట్ గా `రాధే శ్యామ్`తో పలకరించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ పిరియడ్ రొమాంటిక్ సాగా.. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో.. ప్రభాస్ నుంచి రాబోయే చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.
ఇదిలా ఉంటే, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ముహూర్తం ఫిక్స్ అయిందట. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 10న ప్రభాస్ - మారుతి కాంబో ఫిల్మ్ కి కొబ్బరికాయ కొట్టనున్నారట. అలాగే, మే నుంచి రెగ్యులర్ షూటింగ్ బాట పట్టనున్నారని సమాచారం. ఆపై చకచకా చిత్రీకరణ జరిపి ఏడాది చివరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారని టాక్. త్వరలోనే ప్రభాస్ - మారుతి కాంబినేషన్ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.
కాగా, ప్రస్తుతం ప్రభాస్ చేతిలో `ఆది పురుష్`, `సలార్`, `ప్రాజెక్ట్ కె`, `స్పిరిట్` చిత్రాలు ఉన్నాయి. వీటిలో `ఆది పురుష్` చిత్రీకరణ పూర్తిచేసుకోగా.. `సలార్`, `ప్రాజెక్ట్ కె` సెట్స్ పై ఉన్నాయి. అలాగే, `స్పిరిట్` త్వరలోనే పట్టాలెక్కనుంది.
![]() |
![]() |