![]() |
![]() |

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కి 2022 క్యాలెండర్ ఇయర్ భలేగా కలిసొస్తోంది. నెల రోజుల్లోపే రెండు ఘనవిజయాలను అందుకుని మరీ వార్తల్లో నిలుస్తోందీ టాలెంటెడ్ యాక్ట్రస్.
ఆ వివరాల్లోకి వెళితే.. గత నెల 25న ఆలియా భట్ టైటిల్ రోల్ లో నటించిన `గంగూబాయి కథియావాడి` విడుదలై హిందీనాట మంచి విజయం సాధించగా.. ఈ నెల 25న జనం ముందుకు వచ్చిన పాన్ - ఇండియా మూవీ `ఆర్ ఆర్ ఆర్` కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మల్టిస్టారర్ లో చరణ్ కి జంటగా సీత పాత్రలో అలరించింది ఆలియా. మొత్తమ్మీద.. తక్కువ గ్యాప్ లోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయింది ఆలియా. అలాగే `గల్లీ బాయ్` (2019) తరువాత ట్రాక్ తప్పిన ఆలియా.. ఈ రెండు సినిమాలతో మళ్ళీ విజయపథంలోకి వచ్చినట్లయ్యింది. మరి ఇదే ఊపులో ఈ ఏడాదిలోనే విడుదల కానున్న `డార్లింగ్స్`, `బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ః శివ`తోనూ ఆలియా హిట్స్ అందుకుంటుందేమో చూడాలి. కాగా, ఈ సంవత్సరంతో కథానాయికగా ఆలియా పదేళ్ళ కెరీర్ ని పూర్తిచేసుకుంటోంది.
![]() |
![]() |