![]() |
![]() |

దక్షిణాది నుంచి ఈ వారం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ జనం ముందుకు రాబోతున్నాయి. ఆ చిత్రాలే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన `రాధే శ్యామ్`, కోలీవుడ్ స్టార్ సూర్య అభినయించిన `ఎదర్కుమ్ తుణిందవన్`, వెర్సటైల్ స్టార్ ధనుష్ టైటిల్ రోల్ లో ఎంటర్టైన్ చేయనున్న `మారన్`. వీటిలో ముందుగా `ఎదర్కుమ్ తుణిందవన్` (ఈటీ) మార్చి 10న థియేటర్స్ లోకి రానుండగా.. `రాధే శ్యామ్` మార్చి 11న తెరపైకి వస్తోంది. ఇక `మారన్` అదే మార్చి 11న ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.
Also Read: మహేష్ బాబుకి జోడీగా ఆలియా భట్!
ఇదిలా ఉంటే, `రాధే శ్యామ్`లో పూజా హెగ్డే నాయికగా నటించగా.. `మారన్`లో మాళవికా మోహనన్ హీరోయిన్ గా అలరించనుంది. ఇక `ఈటీ`లో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా కనిపించనుంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ ముగ్గురు కూడా ప్రీవియస్ మూవీస్ తో విజయాలు చూసినవారే. `అరవింద సమేత`, `మహర్షి`, `గద్దలకొండ గణేశ్`, `అల వైకుంఠపురములో`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`తో ఐదు వరుస విజయాలు అందుకున్న పూజ.. `రాధే శ్యామ్`తో తెలుగునాట డబుల్ హ్యాట్రిక్ కి రెడీ అయింది. ఇక మాళవిక గత చిత్రం `మాస్టర్`, ప్రియాంక ప్రీవియస్ మూవీ `డాక్టర్` కూడా గత ఏడాది విడుదలై మంచి విజయం సాధించాయి. మరి.. ఈ వారం రాబోతున్న తమ కొత్త చిత్రాలతో పూజ, మాళవిక, ప్రియాంక సక్సెస్ కొనసాగిస్తారేమో చూడాలి.
![]() |
![]() |