![]() |
![]() |

2018 వేసవిలో విడుదలైన `మహానటి` కోసం.. రెండు ముఖ్య పాత్రల్లో కలిసి నటించారు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, చెన్నై పొన్ను సమంత. కట్ చేస్తే.. నాలుగేళ్ళ అనంతరం ఈ ఇద్దరు మరోమారు జట్టుకట్టనున్నారని బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. `నిన్ను కోరి`, `మజిలీ`, `టక్ జగదీశ్` చిత్రాల తరువాత టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ ఓ రొమాంటిక్ డ్రామా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించనుండగా.. అతనికి జోడీగా సమంత దర్శనమివ్వనుందని సమాచారం. వాస్తవానికి, సామ్ కంటే ముందు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని పేరు ఈ ప్రాజెక్ట్ కోసం వినిపించింది. అయితే, వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల కియారా ఈ మూవీకి నో చెప్పిందట. ఏదేమైనా.. త్వరలోనే విజయ్, సామ్ కాంబో మూవీపై క్లారిటీ వస్తుంది.
Also Read: బిగ్బాస్ ఓటీటీ ఎలిమినేషన్ స్టార్ట్!
కాగా, సామ్ ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో `మజిలీ` చేసింది. యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా నటించిన సదరు చిత్రం.. శివ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మరి.. సెకండ్ టైమ్ కూడా శివ నిర్వాణకి సమంత అచ్చొస్తుందేమో చూడాలి.
![]() |
![]() |