Home  »  News  »  నాగ శ్రీనుకి నాగబాబు సాయం.. మంచు కాంట్రవర్సీలోకి మెగా ఎంట్రీ!

Updated : Mar 3, 2022

ఇటీవల మంచు ఫ్యామిలీ ఓ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు దగ్గర పదేళ్లకు పైగా హెయిర్‌ డ్రెస్సర్‌ గా పని చేసిన నాగశ్రీను అనే వ్యక్తి.. తనని కులం పేరుతో దూషించడంతో పాటు తనపై దొంగతనం కేసు మోపారని ఆరోపించాడు. కొడతారన్న భయంతోనే మళ్ళీ మంచు ఫ్యామిలీ దగ్గరకు వెళ్లట్లేదని, వాళ్ళ కారణంగా తన తల్లి ఆసుపత్రి పాలైందని నాగశ్రీను తెలిపాడు. దీంతో మంచు ఫ్యామిలీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే అనూహ్యంగా ఈ కాంట్రవర్సీలోకి నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. మంచు ఫ్యామిలీ వల్ల ఇబ్బంది పడుతున్నానని చెప్పిన వ్యక్తి కుటుంబానికి నాగబాబు ఆర్ధిక సాయం చేయడం హాట్ టాపిక్ గా మారింది.

హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీనుకి నాగబాబు 50 వేల రూపాయలు ఆర్ధిక సాయం చేసారు. అంతేకాకుండా అపోలో ఆసుపత్రి ద్వారా వైద్య సాయం కూడా అందిస్తానని నాగ శ్రీను కుటుంబానికి నాగబాబు భరోసా ఇచ్చినట్లు సమాచారం. అతని తల్లి ఆరోగ్యం క్షీణించడంతో పాటు, అతనికి గత సంస్థ నుండి జీతం కూడా సరిగ్గా అందకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాడని తెలుసుకొని నాగబాబు సాయం చేయడానికి ముందుకు వచ్చినట్లుగా ఆయన టీమ్ చెబుతోంది. అయితే మంచు కార్యాలయం మాత్రం నాగ శ్రీనుకి ప్రతినెలా కరెక్ట్ గా జీతమిచ్చామని, గత నెల కూడా ఇచ్చామని అంటోంది.

మా ఎన్నికల సమయంలో మంచు ఫ్యామిలీకి, నాగబాబుకి మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంచు ఫ్యామిలీ వల్ల ఇబ్బంది పడ్డానంటున్న వ్యక్తికి నాగబాబు సాయం చేయడం హాట్ టాపిక్ గా మారింది. మెగా బ్రదర్ ఎంట్రీతో ఈ కాంట్రవర్సీ మరింత ముదురుతుందేమో చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.