![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సందడి షురూ అయింది. థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో భీమ్లా నాయక్ కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యూట్యూబర్ మౌనికా రెడ్డి ఓ మంచి పాత్రలో నటించడం విశేషం.
పవర్ స్టార్ సినిమాలో చిన్న పాత్ర దొరికినా బాగుండు, కనీసం ఒక సీన్ లో కనిపించినా చాలని ఎందరో ఆర్టిస్ట్ లు ఆశపడుతుంటారు. టీవీ స్టార్స్ సైతం పవన్ సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తుంటారు. తాజాగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లో హైపర్ ఆది కూడా అలాగే మెరిశాడు. కానీ మౌనికా రెడ్డి మాత్రం భీమ్లా నాయక్ లో పవన్ పక్కన ఒక మంచి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. 'అమ్మాయి క్యూటు అబ్బాయి నాటు' వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న మౌనిక.. ఆ తర్వాత యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ సరసన నటించిన 'సూర్య' సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడేకంగా పవర్ స్టార్ సినిమాలో మెరిసింది.

భీమ్లా నాయక్ లో మౌనికది పెద్ద పాత్ర కాకపోయినా.. ఆమె నటించిన సీన్స్ పవన్ తో ఉండటం విశేషం. ఈ మూవీలో పవన్ ఎస్సైగా కనిపించగా, మౌనిక కానిస్టేబుల్ పాత్రలో కనిపించింది. డేనియల్ పాత్రధారి రానా చేసిన పనికి.. పవన్ తో పాటు ఆమె కూడా తన పోలీస్ ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో పవన్, మౌనిక మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. అలాగే మొదట డేనియల్ ని మంచివాడిగా భావించిన ఆమె, ఆ తర్వాత అతని నిజరూపం తెలిసి అసహ్యించుకునే సీన్ బాగుంది. మౌనిక కనిపించింది తక్కువ సన్నివేశాలే అయినా, అవి బలమైన సన్నివేశాలు కావడంతో ఆమె పాత్ర గుర్తుండిపోయే అవకాశముంది.
![]() |
![]() |