![]() |
![]() |
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' మూవీ ఫిబ్రవరి 25 న విడుదలవుతుండటంతో ఇప్పటికే ఇద్దరు యంగ్ హీరోల మూవీలు వాయిదా పడ్డాయి. తాజాగా వరుణ్ తేజ్ నటించిన 'గని' మూవీ కూడా వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.
'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25 న విడుదల కావడం కష్టమనే వార్తల నేపథ్యంలో.. 'గని' సినిమాతో వరుణ్ తేజ్, 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'తో శర్వానంద్, 'సెబాస్టియన్'తో కిరణ్ అబ్బవరం అదే తేదీకి ప్రేక్షకులను పలకరించాలని అనుకున్నారు. అయితే ఊహించని విధంగా 'ఫిబ్రవరి 25 నే భీమ్లా నాయక్ విడుదల' అని ప్రకటన రావడంతో యంగ్ హీరోలు షాక్ అయ్యారు. 'భీమ్లా నాయక్' విడుదల రోజు తమ సినిమాని రిలీజ్ చేస్తే, కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని భావించి ఇప్పటికే 'ఆడవాళ్ళు మీకు జోహార్లు', 'సెబాస్టియన్' మార్చి 4 కి వెళ్లిపోయాయి. బాబాయ్ పవన్ సినిమా రాకతో, అబ్బాయి వరుణ్ సినిమా వాయిదా పడటం ఖాయమని మొదటి నుంచి వార్తలొస్తున్నాయి. తాజాగా గని వాయిదాపై అధికారిక ప్రకటన వచ్చింది.
ఫిబ్రవరి 25 న భీమ్లా నాయక్ విడుదల ఉండటంతో తమ సినిమాని వాయిదా వేస్తున్నట్లు తాజాగా గని మూవీ టీమ్ ప్రకటించింది. బిగ్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ ని చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపిన గని టీమ్.. త్వరలోనే తమ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది.
![]() |
![]() |