![]() |
![]() |

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా రానుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా వీరి కాంబినేషన్ లో రానున్న సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుండటం విశేషం.
కొంతకాలంగా టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్ లు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. ఇప్పుడు రామ్, బోయపాటి వంతు వచ్చింది. రామ్ ఇప్పటికే కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో 'ది వారియర్' అనే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. అలాగే 'ఇస్మార్ట్ శంకర్' డబ్బింగ్ వెర్షన్ తో నార్త్ ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీతో సత్తా చాటడానికి సిద్ధమవుంటున్నాడు. ఇక ఇటీవల 'అఖండ'తో సంచలన విజయాన్ని అందుకున్న బోయపాటి ఫుల్ జోష్ లో ఉన్నాడు. తన మాస్ పవర్ ని పాన్ ఇండియా లెవల్ లో చూపించాలనుకుంటున్నాడు. బోయపాటి కెరీర్ లో 10 వ సినిమాగా, రామ్ కెరీర్ లో 20 వ సినిమాగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

రామ్-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామ్ నటిస్తున్న 'ది వారియర్'కి కూడా ఆయనే నిర్మాత కావడం విశేషం. రామ్-బోయపాటి కాంబో మూవీ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
![]() |
![]() |