![]() |
![]() |

టాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్లు ప్రస్తుతం పాన్ ఇండియా జపం చేస్తున్నారు. అయితే ఓ యంగ్ డైరెక్టర్, యంగ్ హీరో సైతం పాన్ ఇండియా సినిమాతో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. 'హనుమాన్' పేరుతో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ భారీ స్థాయిలో బిజినెస్ చేస్తూ టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది.
'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ్ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'హనుమాన్'. 'జాంబీ రెడ్డి' తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. అయితే ఈ మూవీ తెలుగు, హిందీ నాన్-థియేట్రికల్ రైట్స్ రూ.16 కోట్లకు అమ్ముడుపోవడం హాట్ టాపిక్ గా మారింది. తెలుగు శాటిలైట్, డిజిటల్ హక్కులను రూ.11 కోట్లకు, హిందీ హక్కులను రూ.5 కోట్లకు 'జీ' సంస్థ కొనుగోలు చేసింది. యంగ్ డైరెక్టర్, యంగ్ హీరో కాంబినేషన్ లో వస్తున్న మూవీకి ఈ స్థాయిలో బిజినెస్ జరగడం విశేషమనే చెప్పాలి.
నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ క్రేజీ మూవీలో తేజ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తెలుగు, హిందీతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది.
![]() |
![]() |