![]() |
![]() |

'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మావ' అంటూ సమంత చేసిన సందడి అంతాఇంతా కాదు. ఆ సాంగ్ లిరికల్ వీడియోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లో యూట్యూబ్ లో 12.39 మిలియన్ వ్యూస్ సాధించి, సౌత్ లో అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియోగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ రికార్డుని 'సర్కారు వారి పాట'లోని 'కళావతి' సాంగ్ 20 గంటల్లోనే బ్రేక్ చేయడం విశేషం.
మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'సర్కారు వారి పాట'. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'కళావతి'ని తాజాగా విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 20 గంటల్లోనే 13 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించి, 'ఊ అంటావా' సాంగ్ రికార్డుని బ్రేక్ చేసింది. అంతేకాదు సౌత్ లో 24 గంటల్లో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియోగా రికార్డు క్రియేట్ చేసింది. 24 గంటల్లో ఈ సాంగ్ కి 14.78 మిలయన్ వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ సాంగ్ ముందు ముందు మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశముంది.
కాగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'సర్కారు వారి పాట' మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు మహేష్.
![]() |
![]() |