![]() |
![]() |

కేరళకుట్టి కీర్తి సురేశ్ కెరీర్ ని మేలిమలుపు తిప్పిన చిత్రం `మహానటి`. అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోపిక్ తో నటిగా ఎనలేని గుర్తింపుని పొందింది కీర్తి. అంతేకాదు.. `ఉత్తమనటి`గా జాతీయ పురస్కారాన్ని సైతం దక్కించుకుంది. అయితే, ఆ తరువాత కీర్తి నాయికగా నటించిన సినిమాలేవీ ఆశించిన విజయాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో.. రాబోయే `సర్కారు వారి పాట`పైనే ఆశలు పెంచుకుంది కీర్తి. సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ వేసవి కానుకగా మే 12న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. నాలుగేళ్ళ క్రితం `మహానటి` కూడా ఇదే మే నెలలో జనం ముందు నిలిచింది. 2018 మే 9న విడుదలైన `మహానటి` ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. అదే మే నెలలో నాలుగేళ్ళ తరువాత రాబోతున్న `సర్కారు వారి పాట` కూడా ప్రజాదరణ పొందుతుందేమో చూడాలి.
Also Read: గోపీచంద్ కి జోడీగా `ఖిలాడి` బ్యూటీ!?
కాగా, `సర్కారు వారి పాట`కి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేశ్ బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
![]() |
![]() |