![]() |
![]() |

మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'ధమాకా'. డబుల్ ఇంపాక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ రూపొందుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు.
'పెళ్లి సందD' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రేమికుల రోజు కావడంతో రవితేజ, శ్రీలీల జంటగా ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. రవితేజ ఏదో చెప్తుండగా పల్లీలు తింటూ క్యూట్ గా చూస్తున్న శ్రీలీల లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో శ్రీలీల 'ప్రణవి'గా అలరించనుంది.

ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నాడు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరించనున్నాడు.
![]() |
![]() |