![]() |
![]() |

`జానీ`, `శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్`, `అందరివాడు` చిత్రాల్లో బాలనటుడిగా అలరించిన మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్.. `ఉప్పెన`తో కథానాయకుడిగా తొలి అడుగేశాడు. మొదటి సినిమాతోనే మరపురాని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నటుడిగానూ తన ప్రతిభను చాటాడు. ఆపై హీరోగా నటించిన రెండో చిత్రం `కొండ పొలం`లోనూ తన యాక్టింగ్ స్కిల్స్ తో ఇంప్రెస్ చేశాడు వైష్ణవ్. కట్ చేస్తే.. త్వరలో ఈ మెగా కాంపౌండ్ హీరో తన మూడో చిత్రంతో పలకరించబోతున్నాడు. `రంగ రంగ వైభవంగా` పేరుతో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామా.. వేసవి కానుకగా మే 27న థియేటర్స్ లో సందడి చేయనుంది.
Also Read: హిందీలోనూ 'భీమ్లా నాయక్'.. పవర్ స్టార్ విశ్వరూపం చూస్తారు!
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. వైష్ణవ్ తేజ్ తొలి మూడు చిత్రాలు (`ఉప్పెన`, `కొండ పొలం`, `రంగ రంగ వైభవంగా`) కూడా తెలుగుదనంతో కూడిన శీర్షికలతోనే తెరకెక్కాయి. మరి.. భవిష్యత్ లోనూ ఇదే రీతిలో తెలుగు టైటిల్స్ తోనే వైష్ణవ్ సందడి చేస్తాడేమో చూడాలి. మరోవైపు వైష్ణవ్ అన్న సాయిధరమ్ తేజ్ ఇప్పటివరకు 14 సినిమాల్లో నటించగా.. వాటిలో 8 చిత్రాలకు అన్య భాషలకు చెందిన పదాలతో కూడిన టైటిల్స్ నే కావడం గమనార్హం.
![]() |
![]() |