![]() |
![]() |

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరీర్ బెస్ట్ హిట్స్ లో `అల్లరి మొగుడు` ఒకటి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో.. అనూహ్య పరిస్థితుల నడుమ రెండు పెళ్ళిళ్ళు చేసుకుని ఇబ్బందులు పడే యువకుడిగా భలేగా ఎంటర్టైన్ చేశారు మోహన్ బాబు. అతనికి జోడీగా రమ్యకృష్ణ, మీనా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, కైకాల సత్యనారాయణ, నగేశ్, కాస్ట్యూమ్ కృష్ణ, జేవీ సోమయాజులు, ప్రసాద్ బాబు, రామిరెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
Also Read: ఫిబ్రవరి - మే.. మెగా కాంపౌండ్ సందడే సందడి!
స్వరవాణి కీరవాణి బాణీలకు `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, భువనచంద్ర, కీరవాణి సాహిత్యమందించారు. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో ``ముద్దిమ్మంది ఓ చామంతి``, ``బంచిక్ బమ్ బమ్``, ``నీలిమబ్బు నురగలో``, ``అబ్బా నన్ను గన్న``, ``రేపల్లె మళ్ళీ మురళి విన్నది``, ``నా పాట పంచామృతం`` వంటి పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ఆర్. కె. అసోసియేట్స్ పతాకంపై రాఘవేంద్రరావు సోదరుడు కె. కృష్ణ మోహన్ రావు నిర్మించిన `అల్లరి మొగుడు` అఖండ విజయం సాధించమే కాకుండా.. కన్నడలో `గడిబిడి గండ` (రవిచంద్రన్, రమ్యకృష్ణ, రోజా), తమిళంలో `వీర` (రజినీకాంత్, మీనా, రోజా), హిందీలో `సాజన్ ఛలే ససురాల్` (గోవిందా, టబు, కరిష్మా కపూర్) పేర్లతో రీమేకై ఆయా చోట్ల కూడా ఆదరణ పొందింది. 1992 ఫిబ్రవరి 14న విడుదలై జననీరాజనాలు అందుకున్న `అల్లరి మొగుడు`.. నేటితో 30 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |