![]() |
![]() |

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29 న కన్నుమూసిన సంగతి తెలిసిందే. పునీత్ నటించిన చివరి సినిమా 'జేమ్స్' ఆయన జయంతి సందర్భంగా మార్చి 17న విడుదలవుతోంది. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కోసం పునీత్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో పునీత్ ని గుర్తుచేసుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
జేమ్స్ మూవీ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రభాస్.. "జేమ్స్ రూపంలో మనం ఓ మాస్టర్ పీస్ ని చూడబోతున్నాం. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సర్‌ని అభిమానించే లక్షలాది మందికి ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమైనది. మిస్ యూ సర్" అంటూ రాసుకొచ్చాడు. పునీత్ గురించి ప్రభాస్ పెట్టిన ఎమోషన్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
![]() |
![]() |