![]() |
![]() |

సెన్సేషనల్ హిట్ `ఉప్పెన`తో హీరోగా డ్రీమ్ డెబ్యూ ఇచ్చాడు మెగా యంగ్ సెన్సేషన్ వైష్ణవ్ తేజ్. అయితే, అతని రెండో సినిమాగా రిలీజైన `కొండ పొలం`.. విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ, కమర్షియల్ గా మెప్పించలేకపోయింది. ఈ నేపథ్యంలో.. మూడో చిత్రం `రంగ రంగ వైభవంగా`పైనే ఆశలు పెట్టుకున్నాడు వైష్ణవ్ తేజ్. గిరీశయ్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అతనికి జోడీగా `రొమాంటిక్` భామ కేతికా శర్మ దర్శనమివ్వనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్.. వేసవి కానుకగా మే 27న జనం ముందుకు రానుంది.
Also Read: నాని హీరోయిన్.. బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్!
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో ఇదే మే 27న మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `మెకానిక్ అల్లుడు`(1993) రిలీజైంది. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో చిరు నటించిన తొలి సినిమాగానూ, లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో మెగాస్టార్ స్క్రీన్ షేర్ చేసుకున్న చివరి చిత్రంగానూ అప్పట్లో వార్తల్లో నిలిచిన ఈ మాస్ ఎంటర్టైనర్.. మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసినప్పటికీ బాక్సాఫీస్ ముంగిట మాత్రం నిరాశపరిచింది. మరి.. చిరుకి కలసిరాని అదే మే 27న 29 ఏళ్ళ తరువాత వస్తున్న అతని మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

అన్నట్టు.. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం `ఉప్పెన` నేటితో (ఫిబ్రవరి 12) ఏడాది పూర్తిచేసుకుంది.
![]() |
![]() |